Khadgamala Stotram - InDepth Explanation. #Telugu #Bhakti #Khadgamala #lalithasahasranamam

Aksharabhyasam - Slokas Decoded1,585 words

Full Transcript

నమస్తే అండి ఎలా ఉన్నారు మీరందరూ నిన్నటిదాకా బుక్లో ఎలా రాశాను అని లలిత సహస్రనామంలో ఏదో ఒక నామం గురించి చెప్పుకున్నాం కదా ఇవాల్టి నుంచి ఖడ్గమాల గురించి చెప్తాను ఎందుకంటే ఈ మంత్ ఎండికి మీ ఇంటికి పుస్తకం వస్తుంది. దాని తర్వాత మనము లలిత సహస్రనామంలోని అర్థాలు నేర్చుకుందాము. ఈ లోపల ఖడ్గమాల నేర్చుకుందాము. పిడుగు పడినా కూడా లేవకుండా లలిత సహస్రనామం చదివితే ఆ మంత్ర శబ్దానికి మీ చుట్టూ ఒక శ్రీ చక్రం ఫామ్ అవుతుంది. ఆ శ్రీ చక్రంలో ఉన్న దేవతలు ఎవరు అన్నది ఖడ్గమాలలో ఉంటుంది. అందుకని దాని గురించి తెలుసుకుందాము. అప్పుడే కదా లలిత సహస్రనామం ఎంత పవర్ఫుల్ అన్నది తెలుస్తుంది. ఖడ్గము అంటే కత్తి అని మాల అంటే దండ సంస్కృతంలో జ్ఞానం అనే కత్తిని ధరించిన దేవతల సమూహం అని అర్థం ఈజీగా అర్థంఅవ్వడానికి మనం శ్రీ చక్రాన్ని ఒక కోటలాగా ఊహించుకుందాం. అందులో తొమ్మిది ప్రాకారాలు అంటే లేయర్స్ ఉంటాయి. ఆ కోట మధ్యలో అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి కులువై ఉంటుంది. ఖడ్గమాల చదవడం అంటే శ్రీ చక్రం అనే కోటలోకి ప్రవేశించి ప్రతి ద్వారం దగ్గర ఉన్న దేవతలకు నమస్కరిస్తూ చివరకు మధ్యలో ఉన్న అమ్మవారిని చేరుకోవడం. దీన్నే అంతర్యాగం అంటారు. ఈ స్తోత్రం చదివినప్పుడు మన చుట్టూ ఒక కనబడని శక్తి కవచాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దీనికి ఖడ్గమాల అని పేరు సాధారణంగా శ్రీ చక్ర పూజ అంటే నవావరణ పూజ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే అమ్మ నేను అంత పెద్ద పూజ చేయలేను కానీ నిన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటాను అని ప్రేమతో ఈ ఖడ్గమాల చదివితే ఆ పూర్తి పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. దీని ఉద్దేశం మీరు ఖడ్గమాల చదవండి అని చెప్పడం కాదు ఖడ్గమాల గురించి తెలుసుకోవడం ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. చదవడం పక్కన పెట్టండి. ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఖడ్గమాల అంటే దేవతల శక్తిని మనం యాక్టివేట్ చేస్తున్నట్టు ఎలా పడితే అలా చేయకూడదు ఖడ్గమాల చదివితే కుండలిని యాక్టివేట్ ఎందుకు అవుతుంది అంటే బయట ఉన్న శ్రీ చక్రం మన లోపల కూడా ఉంది. యధాపిండే తథా బ్రహ్మాండే అని అంటారు కదా యూనివర్స్ లో ఏముందో మన బాడీలో కూడా అదే ఉంది. శ్రీరిచ అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రయాణం. ఖడ్గమాల స్తోత్రంలో మనం చదివే ప్రతి నామం వెనుక ఒక శక్తి ఒక అర్థం దాగి ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఖడ్గమాల జోలికి వెళ్ళాలి తప్ప స్తోత్రం నోటికి వచ్చింది కదా అని చదివేయకూడదు. మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం నుండి తొమ్మిదవ ఆవరణ సర్వానందమయ చక్రం వరకు ఉన్న దేవతల వివరణ చాలా పెద్దది కాబట్టి మనం మన ప్రయాణాన్ని మొదటి ఆవరణతో మొదలుపెడదాం మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం ఇది శ్రీ చక్రంలో బయట ఉండే మూడు గీతల చతురస్రం దీన్నే భూపురం అని కూడా అంటారన్నమాట ఇక్కడ మొత్తం 28 మంది దేవతలు ఉంటారు. కొన్ని పుస్తకాలలో 29 మంది దేవతలు ఉంటారు. ఏది కరెక్ట్ అన్నది తెలియదు. ప్రతి సంప్రదాయం కూడా గొప్పదే కాబట్టి మనం రెండు తెలుసుకుందాం. అయితే ఈ 29 లేదా 28 దేవతలను మూడు విభాగాలుగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ లో సిద్ధి దేవతలు ఉంటారు అనిమా సిద్ధులు అంటారు కదా ఆ దేవతలు ఉంటారు. సెకండ్ లేయర్ లో ఎనిమిది మంది మాతృకా దేవతలు ఉంటారు అష్టమాతృకలు అంటారు వీరిని మూడవ లేయర్ లో 10 మంది ముద్రా దేవతలు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఖడ్గమాల చదివేటప్పుడు మనం చేసేది ఒక మానసిక తీర్థయాత్ర. బయట దేశాలు తిరగకుండా మన లోపలికి మనం వెళ్లడం అక్కడ దేవతని దర్శించుకోవడమే ఈ ఖడ్గమాల స్తోత్రం ఒక్కో ఆవరణలో ఉండే దేవతల స్వభావం వారు మనలో ఏ మార్పు తెస్తారో వివరంగా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ది భూపురం త్రైలోక్య మోహన చక్రం గుర్తుపెట్టుకోండి త్రైలోక్య మోహన చక్రం. ఈ త్రైలోక్య మోహన చక్రం లేదా భూపురం శ్రీ చక్రానికి పునాది లాంటిది ఇక్కడ ఉండే అనిమాది సిద్ధులు మనకి లోకంలో విజయాన్ని ఇస్తాయి అష్టమాతృకలు మనలోని కోపం గర్వం వంటి ఎనిమిది చెడు గుణాలను దైవత్వంగా మారుస్తారు. ఇది చదువుతున్నప్పుడు నా శరీరం పవిత్రమవుతోంది అని భావించాలి మనం. శ్రీ చక్రంలోని అతి ముఖ్యమైన పునాది వంటి మొదటి ఆవరణ అంటే ప్రథమ ఆవరణ గురించి పరమ రహస్యాలను ఇప్పుడు నేను వివరిస్తాను జాగ్రత్తగా మనసుపెట్టి వినండి మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను మీకు నోటికి వచ్చేసి ఉంటుంది మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం శ్రీ చక్రాన్ని చూసినప్పుడు మనకు బయట మూడు గీతలతో కూడిన చతురస్రం కని కనిపిస్తుంది కదా దీన్నే భూపురం అంటారు. ఈ మూడు గీతలే మొదటి ఆవరణ. దీని అంధిదేవత త్రిపుర చక్రేశ్వరి. దీని యోగిని ప్రకట యోగిని. ఓకే యోగిని అంటే ఏంటో తెలుసా మీకు మీరు కనుక శ్రద్ధగా వింటున్నట్టయితే యోగిని అంటే ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. మీలో ఎంతమందికి కలిగిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. యోగిని అంటే ఎవరో తెలుసుకుందాం. నేను చెప్పాను కదా మనం స్లోగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఖడ్గమాల నేర్చుకుందాం నేను స్తోత్రం నేర్పించడం లేదు ఖడ్గమాల అంటే ఏంటో తెలియపరుస్తున్నాను సరేనా యోగిని అంటే ఎవరు ప్రతి చక్రానికి ఒక యోగిని ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం సాధారణ అర్థంలో యోగిని అంటే యోగంలో ఉన్న శక్తి అని అర్థం కానీ శ్రీవిద్య లో దీనికి మూడు ప్రధాన అర్థాలు ఉన్నాయి ఒకటి శక్తి శక్తి స్వరూపం అమ్మవారు లలితాంబిక ఒక మహారాణి అయితే ఈ యోగినులు ఆమె సైన్యం మరియు పరివారం అమ్మవారి అనంతమైన శక్తిలోని ఒక్కో అంశమే ఒక్కో యోగిని ఓకే సెకండ్ అర్థం ఏంటంటే ప్రాణశక్తి మన శరీరంలో ప్రవహించే ప్రాణశక్తిని క్రమబద్ధీకరించి అంటే కంట్రోల్ చేసే దేవతలే యోగినులు వీరు మన నాడులు చక్రాలు మరియు ఇంద్రియాలను నడిపిస్తారు. థర్డ్ ఏంటంటే ద్వారపాలకులు అండ్ మార్గదర్శకులు శ్రీ చక్రమణి కోటలో ఒక్కో అంతస్తుకు ఒక్కో యోగిని అధిదేవతగా ఉంటుంది. అంతస్తు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఆవరణ అని సో శ్రీ చక్రంలో ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క యోగిని అధిదేవతగా ఉంటుంది. ఆమె అనుమతి లేనిదే మనం తదుపరి ఆవరణలోకి వెళ్ళలేము. ప్రతి చక్రానికి ఒక యోగిని ఎందుకు ఉంటుంది. శ్రీ చక్రం మన శరీరానికి ప్రతిరూపం అని చెప్పుకున్నాం కదా మన మనస్సు బయట ప్రపంచం నుండి లోపలి ఆత్మ వైపు వెళ్లే క్రమంలో తొమ్మిది దశలు ఉంటాయి. ఒక్కో దశలో మనల్ని పరీక్షించి మనలోని మాలిన్యాలను అంటే చెడు థింగ్స్ ని తీసేసి మనకు యోగశక్తిని ఇచ్చేందుకు ఒక్కో యోగిని ఉంటుంది. ఫర్ ఎక్సాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకునే మొదటి ఆవరణలో యోగిని పేరు ప్రకట యోగిని. ప్రకట యోగిని ఎందుకు? ప్రకట అంటే బయట కనిపిస్తున్నది అని అర్థం. మనం ఈ ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాం. ఈ బాహ్య ప్రపంచంలో మనం చిక్కుకుపోకుండా ఆ దృశ్యాల వెనుక ఉన్న దైవత్వాన్ని ప్రకటించేదే ఈ యోగిని అందుకే ఆమె పేరు ప్రకట యోగిని యోగిని అంటే మనలోని చైతన్యం ఖడ్గమాల చదువుతున్నప్పుడు ఆ యోగిని నీలోని ఒక ప్రత్యేకమైన అడ్డుగోడను అంటే బ్లాకేజ్ ని తొలగిస్తుందన్నమాట మొదటి ఆవరణ యోగిని నీ భౌతిక అడ్డంకులను తొలగిస్తే చివరి ఆవరణ యోగిని నీ అజ్ఞానాన్ని తొలగించి నిన్ను దైవంలో కలిపేస్తుంది. యోగిని దేవత యొక్క పని ఇదన్నమాట యోగిని లేనిదే యోగం లేదు శక్తి లేనిదే శివుడు లేడు కదా ఆ విధంగా ఇప్పుడు యోగిని అంటే క్లారిటీ వచ్చింది కదా ప్రకట యోగిని అని చదువుతున్నప్పుడు అమ్మ ఈ లోకంలో ఉన్న మాయను తొలగించి నీ నిజరూపం నాకు ప్రకటించు అని మనం ప్రార్థించాలి. భూపురంలో మూడు రేఖలు ఉన్నాయని చెప్పాను కదా వాటి గురించి తెలుసుకుందాం ఆ మూడు గీతలు దేనికి సంకేతం అంటే మొదటి బయట రేఖ ఇది హిమాది సిద్ధులకు నిలయం ఇది మన స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీని సూచిస్తుంది. రెండవ రేఖ అంటే మధ్యలో ఉన్న రేఖ అష్ట మాతృకలకు నిలయం. ఇది మన సూక్ష్మ శరీరాన్ని అంటే మన మైండ్ ని ఎమోషన్స్ ని సూచిస్తుంది. మూడవ రేఖ అంటే లోపల రేఖ దశముద్రా దేవతలకు నిలయం ఇది మన కారణ శరీరాన్ని అంటే మన ఆత్మ క్యాజువల్ బాడీని సూచిస్తుంది. అంటే మొదటి ఆవరణ దాటితేనే మనం ఈ మూడు శరీరాలను శుద్ధి చేసుకొని లోపలికి వెళ్ళగలం. ప్రకట యోగిని గురించి ఒక రహస్యం చెప్పనా అమ్మవారు విశ్వరూపంలో మనకు బయట కనిపిస్తోంది. ఈ చెట్లు కొండలు మనుషులు అంతా అమ్మవారి రూపమే కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. ప్రకటయోగిని పని ఏంటంటే ఈ కనిపించే ప్రపంచం మిత్య కాదు ఇది కూడా అమ్మవారి స్వరూపమే అని మనకు ప్రకటించేలా చేస్తుంది. ఈ ఆవరణకు త్రైలోక్య మోహన చక్రం అని ఎందుకు పేరు అంటే ఈ ప్రపంచం నిన్ను మోహంలో ముంచుతుంది. మొహం అంటే ఇల్యూషన్. కానీ ఈ ఆవరణ దేవతలను పూజిస్తే ఆ మోహం పోయి ప్రపంచం మొత్తం అమ్మవారిగా కనిపిస్తుంది. ఇది ప్రకటయోగిని మరియు త్రైలోక్య మోహన చక్రం అని ఎందుకు పిలుస్తారు అన్నదానికి సమాధానం. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ లో ఉన్న దేవతల పేర్ల గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఖడ్గమాల మొదటి ఆవరణ చదువుతుంటే మన మూలాధార చక్రం వద్ద ఉన్న కుండలిని శక్తి నిద్రలేచి పైకి ప్రయాణించడానికి సిద్ధమవుతుంది. అందుకే దీన్ని పునాది అని చెప్పాను ఇందాక. ఈ త్రైలోక్య మోహన చక్రంలోని మొదటి లేయర్ లో ఉన్న దేవతలు సిద్ధి దేవతలు. వీళ్ళు కొన్ని బుక్స్ లో 10 మంది ఉన్నారు కొన్ని పుస్తకాల్లో 11 మంది ఉన్నారు. హనిమా సిద్ధి, అణువంత సూక్ష్మంగా మారడం అంటే మనలోని గర్వాన్ని తగ్గించుకోవడం, లఘిమా సిద్ధి, దూదిల తేలికగా మారడం అంటే మన మనసులోని భారమైన చింతలను వదిలేయడం మహిమా సిద్ధి బ్రహ్మాండమంతా విస్తరించడం మన ప్రేమను అందరికీ పంచడం అన్నమాట. ఈశత్వ సిద్ధి దేనినైనా శాసించే శక్తి మన ఇంద్రియాలపై మనకు పట్టు రావడం వసత్వ సిద్ధి అందరిని అన్నింటిని వశం చేసుకోవడం అంటే ప్రేమతో లోకాన్ని గెలవడం ప్రాకామ్య సిద్ధి అనుకున్నది సాధించడం దీన్నే సంకల్ప బలం అంటారు. భక్తి సిద్ధి దేనినైనా అనుభవించే యోగం ఇచ్చా సిద్ధి మన కోరికలను అమ్మవారి సంకల్పంతో కలపడం ప్రాప్తి సిద్ధి మనం దేనిని వెతికితే అది లభించడం సర్వకామ సిద్ధి అన్ని శుభకరమైన కోరికలు సిద్ధించడం ఇక్కడ అనిమ లఘిమ తర్వాత కొన్ని పుస్తకాలలో గరిమా సిద్ధి అని కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కటి ఫాలో అవుతారు. రెండు కరెక్టే. నెక్స్ట్ లేయర్ లో ఎనిమిది మంది మాతృకలు ఉన్నారు. అష్ట మాతృకలు. వీరు మనలోని భావోద్వేగాలను అంటే ఎమోషన్స్ ని సరిచేస్తారు. వీరు మధ్యవరుసులో ఉంటారు. బ్రాహ్మి అంటే సృష్టి శక్తి సృజనాత్మకత కామం అన్నమాట. మహేశ్వరి అంటే క్రోధం కోపం తగ్గించే శక్తి కౌమారి లోభం పిసినారితనం పోగొట్టే శక్తి వైష్ణవి మోహం వ్యామోహం నుండి రక్షించే శక్తి వారాహి అంటే మదం అహంకారం అనే చేసే శక్తి మాహేంద్రి అంటే మాశ్చర్యం అసూయ తొలగించే శక్తి చాముండా అంటే పుణ్య పాపాల విచక్షణ ఇచ్చే శక్తి మహాలక్ష్మి సర్వ మంగళాలను ఇచ్చే చే శక్తి మంగళం అంటే శుభములు ఇప్పుడు థర్డ్ లేయర్ లో ఉన్న దేవతల గురించి తెలుసుకుందాం. తర్వాత లేయర్ లో ఉన్న దేవతలు మనలోని శక్తి కేంద్రాలను అంటే చక్రాస్ ని తెరిచే తాళం చెవి వంటివారు. వీరు లోపలి వరుసలో ఉంటారు. సర్వ సంక్షోభిని అంటే మనలోని అశాంతిని దూరం చేసి చైతన్యాన్ని కదిలిస్తుంది. తర్వాత సర్వవిద్రావిని అంటే మనలోని భయాలను, అడ్డంకులను కలిగించేస్తుంది. తర్వాత సర్వాకర్షిని మనసుని దైవం వైపు ఆకర్షిస్తుంది. తర్వాత సర్వవశంకరి మన ఇంద్రియాలను మన వసం చేస్తుంది. తర్వాత సర్వ ఉన్మాదిని దైవభక్తిలో పరవశాన్ని కలిగిస్తుంది. సర్వ మహాకుశ ఏనుగుని అంకుశంతో అదుపు చేసినట్లు మన మనసుని అదుపు చేస్తుంది. సర్వ కేచరి మన ప్రాణాన్ని ఆకాశ మార్గంలో అంటే సహస్రారం వైపు తీసుకెళ్తుంది. సర్వ బీజ సృష్టికి మూలమైన మంత్ర బీజాలను ఇస్తుంది. సర్వ యోని అన్నిటికీ మూలమైన అమ్మవారి గర్భం అంటే ప్రకృతి వంటిది. సర్వత్రి ఖండ అంటే జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అనే మూడింటిని ఒకటి చేస్తుంది. సో భూపురం అనే చతురాష్ట్రంలో మూడు లేయర్స్ ఉంటాయి అందులో 10 మంది సిద్ధులు కాపలాగా ఉన్నారు మొదటి గీతలో తరువాత ఎనిమిది మంది తల్లులు మాతృకలు మనని ఆశీర్వదిస్తున్నారు రెండవ గీతలో. ఆ తరువాత 10 మంది ముద్రా దేవతలు మనకి రహస్యాలను చెప్తున్నారు. వీరు మూడవ గీతలో ఉన్నారు. ఇలా మొదటి ఆవరణలోని దేవతలను తలుచుకోగానే ప్రకట యోగినికి నమస్కరించాలి. ఈమె ఈ 28 లేదా గరిమా సిద్ధితో కలిపి 29 దేవతలకు నాయకురాలు. సో ఈ వీడియోలో మనము ఫస్ట్ ఆవరణ గురించి తెలుసుకున్నాము. ప్రకటయోగిని త్రైలోక్య మోహన చక్రం ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి నేర్చుకోండి నేను మళ్ళీ టు డేస్ తర్వాత వీడియో చేసేసరికి మీకు మొదటి ఆవరణ దేవతలు వాటి స్వభావము మీలో వచ్చే మార్పులు తెలియాలి. చాలా మంది బుక్ గురించి అడుగుతున్నారు అండి. ఐ యామ్ సో సారీ నాకు ముందు బుక్ కి డిటిపి చేయించాలి తర్వాత ప్రింటింగ్ ఉంటుంది. తర్వాత బైండింగ్ వర్క్ చేస్తారు కవర్ పేజ్ ఉంటుంది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని తెలీదు. నాకు 15 20 డేస్ ప్రింటింగ్ టైం అంటే నేను అదొక్కటే కౌంట్ చేసుకొని మీకు బుక్ ఇచ్చేస్తున్నానని చెప్పాను ఇది నా మొదటి పుస్తకం లేట్ అవుతుంది నన్ను క్షమించండి కానీ లేట్ అయినా మీరు వెయిట్ చేస్తున్నందుకు నేను లలిత పుస్తకం ఏదైతే ఉందో 50 పేజెస్ బుక్లెట్ నేను ఇంతకుముందులు చెప్పాను కదా వీడియోలో అది మీ అందరికీ ఫ్రీగా ఇస్తున్నాను లేట్ అవుతుందని క్షమాపణతో ప్లీజ్ యక్సెప్ట్ చేయండి అండ్ తిట్టుకోకండి మొదటి పుస్తకం అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. నేనుటెన్త్ న అరుణాచలం వెళ్తున్నాను 12త్ న అమ్మవారికి కాంచీపురంలో నా మొదటి పుస్తకముని సమర్పిస్తున్నాను. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోగలరు. నేను ఈ మంత్ ఎండ్ కయితే తప్పకుండా ఇచ్చేస్తాను. ఈ సారీ మాట దాటను ప్రామిస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి తిట్టుకోకండి కోఆపరేట్ చేయండి. మీలో ఇంకెవరికన్నా కూడా శ్రీ లలిత జ్ఞానసుద్ధా బుక్ కావాలంటే ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. థాంక్యూ సో మచ్.

Need a transcript for another video?

Get free YouTube transcripts with timestamps, translation, and download options.

Transcript content is sourced from YouTube's auto-generated captions or AI transcription. All video content belongs to the original creators. Terms of Service · DMCA Contact

Khadgamala Stotram - InDepth Explanation. #Telugu...