నమస్తే అండి ఎలా ఉన్నారు మీరందరూ మనం లాస్ట్ వీడియోలో ఖడ్గమాల మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం అంటే భూపురం గురించి అక్కడ ఉండే సిద్ధులు మాతృకల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం శ్రీ చక్రంలోని రెండవ ఆవరణలోకి అడుగుపెడుతున్నాం. జాగ్రత్తగా వినండి భూపురం నుండి పద్మంలోకి ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు. మొదటి ఆవరణ భూపురం చతురస్రంగా ఉంటుంది. అది స్థిరత్వానికి సంకేతం కానీ రెండవ ఆవరణ పద్మం. పద్మం బురదలో ఉన్న అంటుకోకుండా పైకి వికసిస్తుంది. సాధకుడు ప్రాపంచిక విషయాలనే బురదలో ఉన్న ఈ 16 దలాల పద్మంలోకి ప్రవేశించగానే అతని మనస్సు దైవత్వంలోకి వికసించడం మొదలవుతుంది. ఇక్కడ ఆశ అనేది పాసం కాదు అది అమ్మవారి వైపు వెళ్లే నిచ్చన. ఆశ అంటే మన కోరికలు మనలో ఉన్న మంచి కోరికలను పరిపూర్ణం చేసి మనల్ని పరిమణించేలా చేసేది ఈ చక్రం. అందుకే దీనిని 16 తలాల పద్మం అని కూడా అంటారు. రెండవ ఆవరణ సర్వాసా పరిపూరక చక్రం. ఈ ఆవరణలో 16 మంది దేవతలు ఉంటారు. వీరిని గుప్తయోగినిలు అంటారు. అంటే వీరు మన లోపల అంతర్లీనంగా అంటే హిడెన్ రహస్యంగా దాగి ఉన్నారన్నమాట. మన ఇంద్రియాలను మనసును నడిపిస్తారు. వీరి పేర్లన్నీ ఆకర్షిణి అని ముగుస్తాయి. అంటే వీరు దేనినైనా ఆకర్షించే శక్తి కలవారు. ఆకర్షిణి అంటే ఏంటి? సాధారణంగా మనం ప్రపంచం వైపు ఆకర్షించబడతాము. ఎక్స్టర్నల్ అట్రాక్షన్ కానీ ఈ గుప్తయోగినిలు మనల్ని అంతర్ముఖం చేస్తారు. ఉదాహరణకు కామాకర్షిణి అంటే కోరికలను పెంచేది కాదు మనలో మోక్షం పొందాలనే కోరికను ఆకర్షించి పదిలపరిచే శక్తి శబ్దాకర్షిణి అంటే బయట వినపడే గోల కాదు మన లోపల వికసించే అనాహత నాదాన్ని వినేలా చేసే శక్తి అనాహత నాదం అంటే సాక్షాత్తు ఓంకారమే అసలు ఈ 16 మంది దేవతలు ఎవరో చూద్దాం. కామాకర్షిణి మన కోరికలను సరైన దిశలో నడిపించే శక్తి బుద్ధి ఆకర్షిణి మన మేధస్సును మేల్కొలిపే శక్తి నేను అనే భావాన్ని పరమాత్మతో కలిపే శక్తి అహంకారాకర్షిణి మంచి మాటలను వేదనాదాన్ని వినే శక్తి శబ్దాకర్షిణి స్పర్శ ద్వారా దివ్యత్వాన్ని పొందే శక్తి స్పర్శాకర్షిణి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని చూడగలిగే శక్తి రూప పాకర్షిని భగవంతుని నామస్మరణలోని రుచిని ఆస్వాదించే శక్తి రసాకర్షిని ఆధ్యాత్మిక పరిమళాన్ని గ్రహించే శక్తి గంధాకర్షిణి చంచలమైన చిత్తాన్ని అమ్మవారి వైపు తిప్పే శక్తి చిత్తాకర్షిణి చిత్తము అంటే ఆలోచనలు సాధనలో వెనుకడుగు వేయకుండా ధైర్యాన్ని ఇచ్చే శక్తి ధైర్యాకర్షిణి నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉంచే శక్తి స్మృత్యాకర్షిణి భగవన్ నామం పట్ల ఆసక్తిని పెంచే శక్తి నామాకర్షిని మంత్ర బీజాలలోని రహస్యాన్ని స్ఫురింపజేసే శక్తి బీజాకర్షిని ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించే శక్తి ఆత్మాకర్షిణి అమృతత్వాన్ని అంటే మోక్షం అన్నమాట అమృతత్వాన్ని ప్రసాదించే శక్తి అమృతాకర్షిని మన దేహాన్ని ఒక దేవాలయంగా మార్చే శక్తి శరీరాకర్షిని ఈ 16 మంది దేవతలు మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ప్రకృతి మరియు పురుషుడు అనే 16 కలలకు అదిదేవతలు ఇంకొంచెం వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి షోడస దలాలు అంటే మనలోని వికారాలు అన్నమాట అంటే ఈ 16 దలాలు దలాలు అంటే పెటల్స్ అన్నమాట ఈ 16 పెటల్స్ 16 దలాలు మన శరీరంలో లోని 16 వికారాలను అంటే మోడిఫికేషన్స్ ని సూచిస్తాయి. అవి ఏంటంటే పంచభూతాలు పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం జ్ఞానేంద్రియం కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, కర్మేంద్రియాలు వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థ. ఈ 15 కాకుండా ఇంకొకటి మనసు ఈ 16 అంశాలే మనల్ని సంసారంలో బంధిస్తాయి. ఈ ఆవరణంలో పూజ చేసినప్పుడు ఈ 16 వికారాలు అమృతమయం అవుతాయి. అంటే మన కన్ను చూసే ప్రతీది అమ్మవారి రూపమే మన చెవి వినే ప్రతీది అమ్మవారి నాదమే అని తెలిసొస్తుంది మనకి మనం ఖడ్గమాల చదివేటప్పుడు వీరిని స్మరిస్తే మన ఇంద్రియాలన్నీ అమ్మవారి వసమవుతాయి. అప్పుడు మనసు అటు ఇటు తిరగకుండా లలితా పరమేశ్వరి పాదాల చెంత స్థిరంగా ఉంటుంది. రెండవ ఆవరణకు అధిదేవత శ్రీ త్రిపుర సుందరి ఈ చక్రం పేరు సర్వాస పరిపూరక చక్రం అని చెప్పుకున్నాం కదా ఈ చక్రానికి అధిదేవత శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు సుందరిగా ఎందుకుంది ప్రపంచంలోని ఆకర్షణల కంటే తన రూపం అత్యంత సుందరమైనదని చూపించి మన ఇంద్రియాలను బయట లోకం నుండి తన వైపుకు మల్లించుకోవడానికి అమ్మవారు ఇక్కడతృ కృప సుందరిగా ఉంది. ఎంత దయో కదా తల్లిది అందుకే ఈమెను సర్వాస పరిపూరక అని కూడా అంటారు. అంటే లోకంలోని చిన్న చిన్న ఆశలన్నిటిని తుడిచివేసి పరమాత్మను పొందాలనే ఒకే ఒక్క మహా ఆశను మాత్రం నెరవేరుస్తుంది. శ్రీవిద్యలో ఈ ఆవరణకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం ఒక్క మాటలో చెప్పలేమ అన్నమాట. అంత ముఖ్యమైనది ఈ ఆవరణ అసలు ఈ చక్రంలోని 16 తలాలు కూడా 15 నిత్యాదేవతలు తిధినిచ్చలు అంటారు కదా వారు ప్లస్ ఒక షోడరసికలకు సంకేతం మన మనసు చంద్రుడితో ముడిపడి ఉంటుంది. అందుకే మన ఆశలు ఆలోచనలు తిధులతో పాటు మారుతుంటాయి. ఈ రెండవ ఆవరణంలో పూజ చేయడం అంటే మన చంచలమైన మనసును అమ్మవారి వెన్నెల వంటి ప్రశాంత స్థితికి తీసుకురావడం ఇక్కడ ఒక రహస్యం చెప్పనా ఈ ఆవరణలో ఒక్కో దలంపై ఒక్కొక్క అచ్చు ఉంటుంది. అచ్చులు అంటే అ నుంచి అః వరకు సంస్కృతంలో అచ్చులను ప్రాణం అంటారు. అంటే ఈ 16 దలాలు మన ప్రాణ శక్తిని శుద్ధి చేస్తాయి. ఈ ఆవరణ దాటితేనే సాధకుడు మాయను దాటి లోపలికి వెళ్ళగలడు. అందుకే ఈ ఆవరణ చాలా ముఖ్యమైనది. ఖడ్గమాలు చదువుతున్నప్పుడు రెండవ ఆవరణ దేవతల పేర్లు రాగానే మన కళ్ళను చెవులను నాలుకను ఒక్కసారి అమ్మవారికి అంకితం ఇస్తున్నట్లు భావించాలి. తల్లి నా ఇంద్రియాలు నీ సేవకే అంకితమని మనసులో అనుకుంటే సర్వ దోషాలు తొలగిపోతాయి. అప్పుడు మనకి మన ఇంద్రియాల మీద విజయం కలుగుతుంది. దీనిని జితేంద్రియ స్థితి అంటారు. ఈ 16 దలాలపై 16 అచ్చులు ఉంటాయని చెప్పాను కదా ఇది సౌభాగ్య విద్యా మంత్రానికి మూలం అన్నమాట. ఒక్కో తలంపై ఒక్కో అక్షరాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన వెన్ను మూకలోని సుషుమ్న నాడిలో ఒక సున్నితమైన కదలిక వస్తుంది. అది కుండలిని శక్తిని నిద్రలేపడానికి సిద్ధం చేసే తొలి పిలుపు ఫస్ట్ కాల్ అన్నమాట. మనం ఖడ్గమాల చదివేటప్పుడు ఆత్మాకర్షిణి నామం రాంగానే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అనే స్పృహ నీకు కలగాలి అలా మనకి కలిగితే అప్పుడే ఈ ఆవరణ పూజ సార్ధకం అవుతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మొదటి ఆవరణలో మనం శరీరాన్ని శుద్ధి చేసుకున్నాం. ఈ రెండవ ఆవరణలో మనం మన మనసును ఇంద్రియాలను అమ్మవారికి అంకితం చేశాం. తల్లి ఇకపై నా కళ్ళు నీకు సొంతం నా మాట నీకు అంకితం అని సమర్పించడమే ఈ చక్రం ఇచ్చే పరమ రహస్యం ఈ 16 తలాల్లో ఉన్న అచ్చులు బీజాక్షరాలని చెప్పుకున్నాం కదా ఇవి కేవలం అక్షరాల అమెరిక కాదు అది మన శరీరంలోని శబ్ద బ్రహ్మ తత్వం మనం ఈ బీజాలను మనసును స్మరించినప్పుడు ఆ ధ్వని తరంగాలు విసుక్తి చక్రం నుండి వెన్ను మూక ద్వారా కిందకి ప్రవహిం ంచి మూలాధారంలో నిద్రిస్తున్న కుండలిని మెల్లగా స్పృశిస్తాయి. అది ఎలా ఉంటుందంటే ఒక నిశబ్దమైన సరస్సులో చిన్న రాయి వేస్తే వచ్చే అలల వంటిది ఈ అలలే కుండలినికి అందే తొలి పిలుపు ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ కాల్ ఇలా ఉంటుందన్నమాట. ఈ రెండవ ఆవరణ ముఖ్యమైనది ఎందుకంటే ఇందులో సౌభాగ్య విద్య రహస్యం దాగి ఉంది అందుకనే శ్రీ విద్యలో సౌభాగ్య విద్య అన్నది ఒక ఉన్నతమైన మంత్రం ఈ మంత్రంలోని ప్రతి అక్షరం కూడా ఈ 16 దళాల్లోని ఏదో ఒక బీజంతో అనుసంధానమై ఉంటుంది. సౌభాగ్య విద్య అనేది శ్రీ విద్యలోని ఒక అత్యంత రహస్యమైన శక్తివంతమైన మహా మంత్రం దీనిని సౌభాగ్య పంచదశి అని కూడా అంటారు. అసలు ఈ సౌభాగ్య విద్య అంటే ఏంటి? పంచదశి మంత్రం లోని 15 అక్షరాల ముందు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలు వచ్చి చేరుతాయి. దీనిని శ్రీవిద్య లోని ఒక ఉన్నత స్థాయిగా పరిగణిస్తారు అంటే అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట ఇది కేవలం ముక్తిని మాత్రమే కాదు ఈ లోకంలో సౌభాగ్యాన్ని అంటే సర్వ సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. సౌభాగ్య విద్యలో వాడే బీజాలు ఈ 16 అచ్చుల యొక్క శక్తి కేంద్రాలు దీని గురించి ఇంకా చాలా లోతుగా చెప్పొచ్చు కానీ ఇప్పటికే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయింది అర్థమై ఉండదని అనుకుంటున్నాను అందుకని లోతుగా వెళ్లట్లేదు మనము ప్రతి ఆవరణ గురించి చెప్పుకున్న తర్వాత లాస్ట్ లో నేను ప్రతి ఆవరణలో ఉన్న దేవత యొక్క రూపం ఏ రంగులో ఉంటారు అవన్నీ చెప్పేటప్పుడు ఇంకా వివరంగా వివరిస్తాను ఇది ఓకేనా చాలామంది కుండలిని అంటే ఏదో ఒక అద్భుతం అనుకుంటారు కానీ నిజానికి మన ఇంద్రియాలు కళ్ళు చెవులు మనసు బయట ప్రపంచం మీద ఆశలు వదిలేసి లోపల వైపు మల్లడమే కుళ్ళలిని జాగరణకి తొలి గుర్తు మనము రెండో ఆవరణలో దేవత గురించి పూజ చేస్తున్నప్పుడు మనకి ఆ దేవతలు అనుగ్రహించారు అని ఎలా తెలుస్తుందంటే ఈ 16 మంది దేవతలు అమృత కలలకు అది దేవతలు సౌభాగ్య విద్య సాధన చేసేటప్పుడు ఇప్పుడు మన నాలుక పై భాగం సాఫ్ట్ గా ఉంటుంది చూడండి అక్కడ ఒక రకమైన తీయని అనుభూతి కలుగుతుంది. దీనిని యోగశాస్త్రంలో కేజరిీ ముద్ర ఫలితం అంటారు. ఆ అమృత ధార కురిసినప్పుడు మనలోని ఆశలన్నీ తృప్తి చెందుతాయి. ఇక బయట ప్రపంచంలో మనకు ఏది కావాలనిపించదు. ఆ స్థితిని పొందినప్పుడే మనం నిజమైన సర్వాస పరిపూరక చక్రాన్ని జయించినట్లు ఇది దాటితే మాయను దాటినట్టే శ్రీవిద్యలో అక్షరాలను కేవలం శబ్దాలుగా చూడరు వాటిని మాతృకలు విశ్వానికి తల్లులు అని పిలుస్తారు శ్రీవిద్య ఉపాసకులు ఇంతలా అక్షరం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎన్నిసార్లు ఈ వీడియో విన్నా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నా అక్షరాన్ని అక్షరంలా కాకుండా అక్షర దేవతగా చూసి మంచి మాటని మంచి ఆలోచనల్ని మనం పెంపొందించుకోకపోతే ఇవన్నీ వేస్టే ఏది పనికి రాదు మంచి మాటలో ఉన్న శక్తి మీకు తెలియడం లేదు అక్షరం అంటేనే దేవత దాన్ని మంచిగా మాట్లాడడానికి మాత్రమే ఆ అక్షరాన్ని వాడాలి అప్పుడే మనకి దేవత అనుగ్రహం కలుగుతుంది నాకు కోపం కోపం వచ్చింది కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా నేను అంటే మీ కర్మ అనుకోండి అంతే కొంచెం కటువుగా చెప్పానని మీకు అనిపించిందా ఐ సో సారీ ఏం చేయలేను దీన్ని ఇంకెలా చెప్పాలో నాకు తెలియదు నిజంగా కూడా కోపంలో నేను నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను నాకు కోపం ఎక్కువ అంటే నిజంగా అది మీ పాపకరమే దయచేసి కోపాన్ని వదిలేసుకోండి చక్కగా ప్రశాంతంగా ఉండండి ఏం జరిగినా అది అమ్మవారి ఆజ్ఞే అనుకోండి మీ మంచికే అనుకోండి మీకు మంచి జరగకపోతే పోతే చూడండి ఈ ఆవరణ మొత్తం అక్షరాల గురించే తెలుసా ఎంత చెప్పొచ్చో తెలుసా నేను వీటి గురించి 16 అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని బీజాలు అంటారు కదా ఆ నుంచి అహ వరకు అవన్నీ కూడా శివ స్వరూపమైన ప్రకాశాన్ని సూచిస్తాయి. ఇవి లేనిదే హల్లులు కూడా పలకబడవు అందుకే ఇవి ఆత్మ శక్తికి సంకేతం హల్లులన్నీ కూడా శక్తి స్వరూపమైన విమర్శను సూచిస్తాయి. ఇవి అచ్చులతో కలిసినప్పుడే వీటికి ఒక రూపం వస్తుంది. శ్రీ చక్రంలో రెండవ ఆవరణలో 16 దళాలపై అచ్చులు ఉంటే ఇతర ఆవరణలోని దలాలపై హల్లులు ఉంటాయన్నమాట. ఈ హల్లులన్నీ కూడా కొన్ని వర్గాలుగా విభజన అయి ఉన్నాయి. అవేంటో ఒకసారి చెప్తా వినండి. కవర్గం అంటే క ఖ గ న ఇది పృథ్వి తత్వం అంటే మన శరీరంలోని ఎముకలు మాంసం వంటి ఘణ పదార్థాలను నియంత్రిస్తుంది. చ వర్గం అంటే చ ఛ జ న్య ఇది చలతత్వం మన శరీరంలోని రక్తం ఇతర ద్రవాలను నియంత్రిస్తుంది. ట వర్గం అంటే ట ఠ డ ఠ న ఇది తేజస్సు అంటే అగ్ని తత్వం మన జీర్ణ శక్తిని శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. త వర్గం అంటే త థ ద థ న ఇది వాయుతత్వం గాలి మనం పీల్చే ప్రాణవాయువుని నియంత్రిస్తుంది. ప వర్గం అంటే ప భ ఇది ఆకాశ తత్వం మనలోని ఖాళీ ప్రదేశాలను శబ్దాన్ని నియంత్రిస్తుంది. య స వర్గాలు అంటే ఇవి మన అంతరింద్రియాలు అంటే మనస్సు బుద్ధి, చిత్తం, అహంకారాన్ని సూచిస్తాయి. చూసారా ఇవన్నీ అక్షరాలే. ఈ అక్షరాలన్నీ దేవతలే ఈ దేవతలే మనని కంట్రోల్ చేస్తూ ఉంటాయి మన ఆర్గాన్స్ ని సెన్సెస్ ని ఇప్పుడన్నా అర్థమైందా మంచిగా మాట్లాడండి మంచి ఆలోచనలనే ఉంచండి అని ఎందుకు చెప్తున్నాను మీరు అలా చేస్తేనే మంత్రం సిద్ధిస్తుంది ఏ పూజనా ఫలిస్తుంది. అసలు ఈ రెండవ ఆవరణలో ఉన్న పెద్ద రహస్యం ఏంటో తెలుసా కామకళ రహస్యం శూన్యం నుండి స్పందన అన్నమాట అమ్మవారు కేవలం ఒక రూపం కాదు ఆమె యొక్క స్పందన రెండవ ఆవరణలో ఉన్న 16 అచ్చులు అ నుంచి అః వరకు కేవలం అక్షరాలు కావు అవి శివశక్తి సమైక్య స్థితి నుండి పుట్టిన మొదటి అరుపు అది ఫస్ట్ సౌండ్ అ అంటే శివుడు ఇప్పుడు హ అంటే శక్తి ఈ రెండిటి కలయకే అహం అంటే నేను ఈ 16 దలాలు కూడా మనలోని అహం నేను నేను నేను చేశాను అనే భావన ఏదైతే ఉందో ఆ అహాన్ని అహంకారంగా కాకుండా విశ్వాత్మకమైన అహంగా మారుస్తాయి చూసారా అక్షరాలు ఎంత శక్తివంతమైనవో శ్రీ చక్రం మధ్యలో ఉండే బిందువు అమ్మవారు అయితే ఆ బిందువు తనను తాను 16 కలలుగా విస్తరించుకున్నప్పుడే ఈ రెండవ ఆవరణ ఏర్పడింది. అంటే ఈ 16 మంది గుప్త యోగినులు వేరే కాదు వారు అమ్మవారి చిత్కల రూపాలు ఒకవేళ మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి. ఒకసారి రివిజన్ లో మాత్రం ఇక్కడ చెప్తాను. ఈ చక్రం పేరు సర్వాస పరిపూరక చక్రం. సకల కోరికలను దైవికమైనవిగా మార్చే చక్రం ఇది. రూపం ఏంటి? 16 దళాల పద్మం. 16 పెటల్ లోటస్. యోగిని స్థితి ఏంటి? గుప్తయోగినిలు. అంటే మన ఇంద్రియాలలో దాగి ఉండి నడిపించే శక్తులు వీరు. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి ఎవరు? శ్రీ త్రిపుర సుందరి. ఈ ఆవరణలోని రహస్యం ఏంటి? కామకళ రహస్యం. ఈ 16 మంది దేవతలను మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ముగ్గురు దేవతలు ఎవరు? కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి. మొదట మనలో పుట్టేది కోరిక దానిని ఆలోచించే బుద్ధి ఆ పని చేస్తున్నది నేనే అనే అహంకారం పుట్టిన కోరిక కామాకర్షిణి ఆలోచించే బుద్ధి బుద్ధ్యాకర్షిణి అది చేస్తున్నది నేనే అనే అహంకారమే అహంకారాకర్షిణి ఓకే నెక్స్ట్ ఫైవ్ సెన్సెస్ అన్నమాట అహంకారం పుట్టాక బయట ప్రపంచాన్ని మనం ఐదు ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాము. అవే శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి వినడం తాకడం చూడడం రుచిని ఆస్వాదించడం వాసన పీల్చడం అర్థమైంది కదా అహంకారం పుట్టాక బయట ప్రపంచాన్ని మనం ఈ ఐదు ఇంద్రియాలతో గ్రహిస్తాము. శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి ఓకే ఇప్పుడు టోటల్ ఎన్ని చెప్పుకున్నాం ఎయిట్ చెప్పుకున్నాం ఇంకా ఎనిమిది మంది గురించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఈ ఇంద్రియాలను ఉపయోగించుకుని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా ఈ ఇంద్రియాల ద్వారా సమాచారం వచ్చాక మనము దానికి స్పందిస్తాము. అవేంటి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి అంటే చిత్తము మనసు ధైర్యము ధైర్యము అంటే తెలిసినదే స్మృత్యాకర్షిణి అంటే గుర్తుంచుకోవడం జ్ఞాపకం అన్నమాట నామాకర్షిణి అంటే పేరు లేదా గుర్తింపు ఇలా మనసుతో ధైర్యంగా జ్ఞాపకం ఉంచుకొని దాని గుర్తింపుతో మనం వ్యవహరిస్తాము. ఇవన్నీ స్టేజెస్ దాటిన తర్వాత చివరిగా సాధకుడు భౌతిక ప్రపంచం నుండి ఆత్మ వైపు వెళ్తాడు. ఇక్కడ నలుగురు దేవతలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. బీజాకర్షిణి అంటే మంత్రబీజం. ఆత్మాకర్షిణి అంటే నేనే ఆత్మను అనే జ్ఞానం. అమృతాకర్షిణి అంటే మోక్షం లేదా అమృత తత్వం. శరీరాకర్షణి అంటే దేహమే దేవాలయం అని అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో అడగండి వివరిస్తాను ఇందులో చెప్పుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి ఎంతో రహస్యం ఉంది రెండవ ఆవరణలో కానీ ఇప్పుడు చెప్తే అర్థం కాదు నేను ఇంకొక వీడియోలో అంటే ఈ మొత్తం తొమ్మిది ఆవరణలో చెప్పిన తర్వాత లాస్ట్ లో ఇన్ డెప్త్ గా చెప్పుకుందాము అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కొంచెం నా ట్రిప్ గురించి చెబుదాం అనుకుంటున్నాను నేను అరుణాచలము కాంచీపురం వెళ్లి కంచిలో అమ్మవారికి పుస్తకం సమర్పించుకుని వస్తున్నాను అన్నమాట నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నేను అరుణాచలంలో గిరి ప్రదక్షణ చేసిన తర్వాత నాకు YouTube నుంచి ఈమెయిల్ వచ్చింది. మీకు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటినుంచి మీరు ఎర్న్ చేయొచ్చు. మీరు అప్లై చేయండి అని ఈమెయిల్ వచ్చింది. కరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ 4 ఓ క్లాక్ కి నేను ఫోటో పెట్టాను చూడొచ్చు మీరు అప్పుడే గిరి ప్రదక్షణ పూర్తి చేసుకొని రూమ్ కి వచ్చి స్నానం అది చేసి శివుడి దర్శనం కని వెళ్దామ అనుకున్నాము. అప్పుడు ఎగజక్ట్లీ 4ఓ క్లాక్ కి బ్రహ్మ ముహూర్తంలో నాకు ఈమెయిల్ వచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆ శివుడు బ్లెస్సింగ్ గా భావించాను నేను గుడిలోనే కూర్చుని నేను ఫామ్ ఫిల్ చేశాను. తర్వాత మేము కంచి వెళ్ళాము అమ్మవారికి అభిషేకం చేయించాను. అభిషేకం చేయించిన తర్వాత నాకు ఆరోజు ఈవెనింగ్ ఒక ఈమెయిల్ ఇచ్చింది మీ మోనిటైజేషన్ యక్సెప్ట్ అయిపోయింది అనేసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ శివుడి దగ్గర ఫామ్ వచ్చింది ఫీ చేయమని అమ్మవారి దగ్గర అది యక్సెప్ట్ అయిపోయింది. అలా ఫ్రైడే రోజున కంచిలో నాకు మోనిటైజేషన్ స్టార్ట్ అయింది. ఐ యమ్ సో హ్యాపీ నేను అది అమ్మవారి బ్లెస్సింగ్ కింద అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీకుఅందరికీ తెలిసిందే నేను బుక్ కి ప్రైస్ పెట్టట్లేదు ఎందుకంటే అందరూ అంత ఎఫర్ట్ చేసి కొనగలరో లేదో అన్న ఉద్దేశంతో పెట్టలేదు దయచేసి అడ్వాంటేజ్ తీసుకోకండి మీకే విద్య ఫలించదు మీకు తగ్గ దక్షిణ ఇవ్వండి ఓకే బట్ ఎనీవేస్ మీరు ఎంత ఇచ్చినా నాకు సంతోషమే. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు ఇప్పుడు పుస్తకాలు ప్రింట్ చేయించడానికి మీ డొనేషన్స్ తో పాటు మోనిటైజేషన్ అయింది కాబట్టి అది కొంచెం హెల్ప్ అవ్వచ్చు అంతంత యడ్స్ నుంచి అయితే రాదు అయితే నేను మెంబర్షిప్ అట్లా పెడదాం అనుకుంటున్నాను మీకు ఓకేనా నేను మెంబర్షిప్ పెడితే మంత్లీ ఇంత అమౌంట్ పే చేయాలి అని ఉంటుందన్నమాట లైక్ 299 పీస్ అలా ఉంటుంది ఆర్ అంతకన్నా తక్కువ కూడా ఉంటుంది నేను చూడాలి నాకు ఇంకా వివరం తెలియదు నేను ఇలా మెంబర్షిప్ పెట్టాను అనుకోండి మంత్లీకి మీరు మెంబర్షిప్ తీసుకుంటారా కమర్షియల్ అని అయితే అనుకోరు కదా నాకు బుక్ ప్రింటింగ్ కి నిజంగా చాలా అవసరం అవుతుంది. మీలో ఇంకెవరికైనా సరే శ్రీ లలిత జ్ఞాన సుధా బుక్ అంటే శ్రీ లలిత సహస్రనామాలకి అర్థం తెలిపే బుక్ అన్నమాట. ఇది ఇంకా ఎవరికైనా కావాలి అంటే ఈ కనిపించే నెంబర్ కివాట్ప్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థాంక్యూ సో మచ్.
Get free YouTube transcripts with timestamps, translation, and download options.
Transcript content is sourced from YouTube's auto-generated captions or AI transcription. All video content belongs to the original creators. Terms of Service · DMCA Contact